: ఢిల్లీకి చేరిన చంద్రబాబు... నేడు జైట్లీ, ఉమా భారతిలతో కీలక భేటీ
టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు ఐదు రోజుల చైనా పర్యటన ముగిసింది. నిన్న మధ్యాహ్నమే తన విదేశీ పర్యటనను ముగించుకుని తిరుగు పయనమైన చంద్రబాబు... నిన్న రాత్రికే ఢిల్లీకి చేరుకున్నారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ, కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమా భారతితో చంద్రబాబు నేడు భేటీ కానున్నారు. రాష్ట్రం ఎదుర్కొంటున్న పలు సమస్యలను ఆయన వారితో చర్చించనున్నట్లు సమాచారం. చైనా నుంచి ఢిల్లీ చేరుకున్న చంద్రబాబుకు కేంద్ర మంత్రులు అశోక్ గజపతిరాజు, సుజనా చౌదరి, ఢిల్లీలో ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి కంభంపాటి రామ్మోహన్ రావులు ఘనంగా స్వాగతం పలికారు.