: పాతబస్తీలో భారీఎత్తున తనిఖీలు
ఐఎస్ఐఎస్ తీవ్రవాదులు హైదరాబాదులోని పాతబస్తీలో పట్టుబడడంతో, అక్కడ ఇంకా వారి అనుచరులు, మద్దతుదారులు మరింతమంది ఉండవచ్చనే అనుమానంతో భారీ తనిఖీలు చేపట్టారు. గతంలో పలు సందర్భాల్లో కార్డాన్ సెర్చ్ ఆపరేషన్లు చేపట్టినప్పటికీ ఆకతాయిలను మాత్రమే అదుపులోకి తీసుకున్న పోలీసులు, ఈసారి మరింత క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ తనిఖీలు ముగ్గురు ఎస్పీలు, ఐదుగురు డీఎస్పీల ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. భారీ ఎత్తున చేరుకున్న భద్రతా బలగాలతో ఈ తనిఖీలు నిర్వహిస్తున్నారు. దేశంలో ఎక్కడ ఉగ్రదాడి జరిగినా దానికి హైదరాబాదుకు, భత్కల్ కు ఏదో ఒక సంబంధం ఉంటోంది. ఈ రెండు పట్టణాల్లో మాత్రమే ముస్లిం జనాభా అధిక సంఖ్యలో ఉండడంతో ఇక్కడ ఉగ్రవాదులు సులువుగా పాగా వేసేందుకు అవకాశం దొరుకుతోందని నిఘా వర్గాలు అంచనా వేస్తున్నాయి. తాజాగా ఐఎస్ఐఎస్ తీవ్రవాదులు పట్టుబడడంతో ఈ అనుమానం మరోసారి బలపడింది.