: వీవీఎస్ లక్ష్మణ్ పై ఆరోపణల్లో వాస్తవం లేదు: బీసీసీఐ
టీమిండియా ప్రధాన కోచ్ అనిల్ కుంబ్లేకు చెందిన క్రికెట్ టెక్నాలజీ కంపెనీలో మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ కు ఎటువంటి వాటాలు లేవని బీసీసీఐ పేర్కొంది. కుంబ్లే కంపెనీలో లక్ష్మణ్ కు వాటాలున్నాయని, కాన్ ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రస్టు కింద అతనిపై చర్యలు తీసుకుంటున్నట్లు వస్తున్న ఆరోపణల నేపథ్యంలో బీసీసీఐ ఈ ప్రకటన చేసింది. ఆ ఆరోపణల్లో ఎటువంటి వాస్తవం లేదని కొట్టి పారేసింది. గతంలో క్రికెట్ టెక్నాలజీ, ప్లేయర్ మేనేజ్ మెంట్ కు సంబంధించిన కంపెనీల్లో లక్ష్మణ్ కు ఐదు శాతం షేర్లు ఉన్నాయి. అయితే, 2016 మార్చిలో ఆ వాటాల నుంచి లక్ష్మణ్ వైదొలగడమే కాకుండా ఆ కంపెనీకి సంబంధించిన ఎటువంటి అధికారిక, అనధికారిక కార్యకలాపాల్లోను భాగస్వామ్యం కావడం లేదని బీసీసీఐకు లక్ష్మణ్ గతంలో తెలిపాడు.