: పైలట్ చాకచక్యం...రెండు టైర్లు పేలినా ప్రమాదం జరగని వైనం
విమానం ల్యాండ్ అవుతుండగా టైరు పేలిపోతే సాధారణంగా ప్రమాదం జరుగుతుంది. కొన్ని సార్లు పైలట్ చాకచక్యంతో ప్రమాదం తప్పుతుంది. జమ్ముకశ్మీర్ లో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. పారామిలటరీ సిబ్బందితో ప్రయాణించిన ఎయిర్ ఇండియా ఛార్టర్డ్ ఫ్లైట్ శ్రీనగర్ లో ల్యాండ్ అవుతుండగా రెండు టైర్లు పేలాయి. అయితే పైలట్ చాకచక్యం, అదృష్టం కలిసిరావడంతో విమానం సురక్షితంగా ల్యాండ్ అయింది. విమాన సిబ్బంది, బలగాలు ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడం విశేషం. ఈ ఘటనపై అధికారులు దర్యాప్తుకు ఆదేశించారు.