: టీడీపీ అక్రమాలను ప్రశ్నించేందుకు నిఘా కమిటీ: కాంగ్రెస్ నేత రఘువీరారెడ్డి
టీడీపీ అక్రమాలను ప్రశ్నించేందుకుగాను కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఒక నిఘా కమిటినీ ఏర్పాటు చేయనున్నామని ఏపీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డి చెప్పారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, నవ్యాంధ్ర రాజధాని భూముల విషయంలో టీడీపీ అక్రమాలకు పాల్పడిందని ఈ విషయమై ప్రశ్నించేందుకు నిఘా కమిటీని ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. సీఎంకు ప్రచారంపై ఉన్న శ్రద్ధ, ఎన్నికల హామీలను అమలు చేయటంపై లేదని విమర్శించారు. రాజధాని నిర్మాణం నిమిత్తం భూములిచ్చిన రైతులకు ప్రభుత్వం తన హామీలను నెరవేర్చడం లేదని రఘువీరా ఆరోపించారు.