: ఆర్బీఐ గవర్నర్ పదవి షార్ట్ లిస్టు కుదింపు... అరుంధతి భట్టాచార్యకు ఛాన్స్ లేనట్టే!
ఆర్బీఐ గవర్నర్ పదవికి సంబంధించిన షార్ట్ లిస్టును నాలుగు నుంచి రెండుకు ప్రభుత్వం కుదించింది. ఈరోజు విడుదలైన నివేదికలు ఈ విషయాన్ని వెల్లడించాయి. ఈ పదవికి పోటీలో ఉన్న ఎస్బీఐ చైర్ పర్సన్ అరుంధతి భట్టాచార్య, ప్రస్తుత ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ ఊర్జిత్ పటేల్ పేర్లను ప్రభుత్వం పక్కన పెట్టింది. ఆర్బీఐ మాజీ డిప్యూటీ గవర్నర్లు రాకేష్ మోహన్, సుబీర్ గోకర్న్ పేర్లను ఈ పదవికి పరిశీలిస్తున్నట్లు సమాచారం. వచ్చే నెల 15వ తేదీకల్లా ఈ నియామకం పూర్తికావచ్చని తెలుస్తోంది.