: తెలంగాణలో డబుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణంపై మలేషియా ప్రభుత్వం ఆసక్తి
తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ మలేషియా పర్యటనలో ఉన్నారు. తన పర్యటనలో భాగంగా నేడు మలేషియా మంత్రి డాటోసేరివెల్లుని కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు తెలంగాణలో అమలు పరుస్తోన్న పథకాలపై కేటీఆర్ వివరించారు. తెలంగాణలో డబుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణంపై మలేషియా ప్రభుత్వం ఆసక్తి చూపి, మరిన్ని వివరాలు అడిగి తెలుసుకున్నట్లు సమాచారం. దీనిలో భాగస్వామ్యం అయ్యే అంశంపై సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. అలాగే తెలంగాణలో పలు రంగాల్లో ఉన్న పెట్టుబడుల అవకాశాలను కేటీఆర్ మలేషియా మంత్రికి వివరించారు. తెలంగాణలో టీఎస్ఐపాస్ విధానాన్ని అమలు చేస్తున్నామని, ఎలక్ట్రానిక్, ఐటీ, ఆటోమొబైల్ రంగాల్లో పెట్టుబడులకు మంచి అవకాశాలు ఉన్నాయని కేటీఆర్ తెలిపారు.