: టార్గెట్... తెలంగాణ ఐటీ కారిడార్!


తెలంగాణ అభివృద్ధిలో కీలక పాత్రపోషిస్తున్న ఐటీ కారిడార్ పై ఐఎస్ఐఎస్ తీవ్రవాదుల కన్ను పడినట్టుంది. దేశ విదేశాల నుంచి నిపుణులు హైదరాబాదుకు ఉద్యోగం నిమిత్తం వస్తున్నారు. చెన్నైని వరదలు ముంచెత్తడం, బెంగళూరులో గణనీయంగా కాలుష్యం పెరిగిపోవడంతో ఐటీ సంస్థలు కొత్త డెస్టినేషన్ వెతుక్కున్నాయి. అలాంటి సంస్థలన్నింటికీ హైదరాబాదు స్వర్గధామంగా మారింది. దీంతో గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్ వంటి పెద్దపెద్ద సంస్థలన్నీ హైదరాబాదు ఐటీ కారిడార్ లో ప్రధాన కార్యాలయాలు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నాయి. రాజకీయ, ఆర్థిక, సంప్రదాయ మూలాలపై దెబ్బకొట్టే తీవ్రవాద సంస్థ ఐఎస్ఐఎస్ వివాదాల నగరంగా పేరుపడ్డ హైదరాబాదులో మకాంవేసి, మతకల్లోలాలు, బాంబుదాడులతో దేశ ప్రతిష్ఠను దెబ్బతీయడం కోసం పెద్ద ప్రణాళికనే రచించింది. దీంతో హైదరాబాదులోని ఐటీ పరిశ్రమలకు నెలవైన హైటెక్ సిటీ, గచ్చిబౌలి తదితర ప్రాంతాల్లో దాడులు చేయాలని నిర్ణయించింది. ఈ దాడులు సాధారణంగా ఉండకూడదని, ప్రపంచం మొత్తం తమవైపు తలెత్తి చూసేలా చేయాలని తీవ్రవాదులు భావించారు. వారి వ్యూహాలను ఎన్ఐఏ అధికారులు ముందే పసిగట్టి ఉగ్రవాదులను అదుపులోకి తీసుకోవడంతో వారి ఆటకట్టింది.

  • Loading...

More Telugu News