: నాందేడ్ నుంచి పిస్తోలు, తూటాల కొనుగోలు


హైదరాబాదులోని పాతబస్తీలో పట్టుబడ్డ ఐఎస్ఐఎస్ తీవ్రవాదుల నుంచి పలు కీలక విషయాలను ఎన్ఐఏ అధికారులు రాబడుతున్నారు. ఇందులో ప్రధాన నిందితుడు హబీబ్ మహారాష్ట్రలోని నాందేడ్ నుంచి పిస్తోలు, తూటాలు కొనుగోలు చేసినట్టు అధికారులు తెలుసుకున్నారు. దీంతోనే వారు నగర శివార్లలో ఫైరింగ్ ప్రాక్టీస్ చేసినట్టు వెలుగులోకి వచ్చింది. ఐదుగురు సభ్యులు గల త్రీవవాదుల ముఠా ఇస్తాంబుల్, బ్రస్సెల్స్ తరహా దాడులకు పాల్పడేందుకు సిధ్ధంగా ఉన్నారని వారు చెప్పారు. వారిని అదుపులోకి తీసుకోకపోయి ఉంటే రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని, పెను విధ్వంసం జరిగి ఉండేదని అధికారులు తెలిపారు.

  • Loading...

More Telugu News