: కడుపులో పెట్టుకుని చూసుకుంటామన్న కేసీఆర్ మాటలు ఏమయ్యాయి..?: ఏపీ న్యాయవాదుల జేఏసీ


'ఆంధ్రావారిని కడుపులో పెట్టుకుని చూసుకుంటామన్న కేసీఆర్ మాటలు ఏమయ్యాయి..?' అని ఆంధ్రప్రదేశ్ న్యాయ‌వాదుల జేఏసీ విజ‌య‌వాడ‌లో ప్ర‌శ్నించింది. రాష్ట్ర విభ‌జ‌న‌కు ముందు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అలా మాట్లాడి ఇప్పుడు మ‌రో తీరుని క‌న‌బ‌రుస్తున్నార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. వ‌రంగ‌ల్‌లో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు చెందిన న్యాయ‌మూర్తిపై దాడి జ‌ర‌ప‌డమేంట‌ని ప్ర‌శ్నించింది. ప్ర‌జ‌ల‌ను రెచ్చ‌గొట్ట‌డం భావ్యంకాద‌ని చెప్పింది. హైకోర్టు విభ‌జ‌న జ‌ర‌గాలంటే ఓ పధ్ధతి ఉంటుంద‌ని పేర్కొంది. న్యాయ‌మూర్తిపై దాడిని ఖండిస్తున్నామ‌ని న్యాయ‌వాదుల‌ జేఏసీ తెలిపింది.

  • Loading...

More Telugu News