: విజయవాడ స్కూల్ హాస్టల్ లో ఫుడ్ పాయిజనింగ్... పలువురు విద్యార్థులకు అస్వస్థత
నవ్యాంధ్ర రాజధాని ప్రాంతమైన విజయవాడలోని ఫిట్ జీ స్కూల్ లో ఈ మధ్యాహ్నం భోజనం చేసిన విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఫిట్ జీ స్కూలుకు అనుబంధంగా ఓ హాస్టల్ ను యాజమాన్యం నిర్వహిస్తుండగా, పలువురు విద్యార్థులు అక్కడే ఉండి చదువుకుంటున్నారు. ఈ మధ్యాహ్న భోజన సమయంలో కలుషితమైన ఆహారం తినడంతోనే వారు అస్వస్థతకు లోనయ్యారు. పలువురు విద్యార్థులు వాంతులు చేసుకోగా, ఎంతో మంది కడుపులో నొప్పిగా ఉందని చెప్పడంతో, వారందరినీ సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. విషయం తెలుసుకున్న అధికారులు విచారణ చేపట్టి ఫుడ్ శాంపిల్స్ సేకరించారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.