: ఫిరాయింపులపై సుప్రీం గడప తొక్కిన వైసీపీ!... విచారణ వారం పాటు వాయిదా!
ఏపీలో అధికార పార్టీ టీడీపీ చేపట్టిన ‘ఆపరేషన్ ఆకర్ష్’కు విపక్ష వైసీపీ చిత్తైపోయింది. ఇప్పటికే వైసీపీ టికెట్ల మీద విజయం సాధించిన ఎమ్మెల్యేల్లో 20 మంది టీడీపీలోకి చేరిపోయారు. ఇక ఎప్పుడు ఏ ఎమ్మెల్యే చేజారుతారోనన్న భయాందోళనలో వైసీపీ సతమతమవుతోంది. ఈ పరిస్థిితి నుంచి కాస్తంత ఊపిరి పీల్చుకునేందుకంటూ ఆ పార్టీ కొద్దిసేపటి క్రితం సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. తమ పార్టీ టికెట్ పై విజయం సాధించి టీడీపీలో చేరిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ ఆ పార్టీ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ ను విచారణకు స్వీకరించిన సర్వోన్నత న్యాయస్థానం విచారణను వారం పాటు వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది.