: ఇక భూతలం నుంచే భారత్ గగనతల లక్ష్యాలను ఛేదించగలదు!... బరాక్-8 ప్రయోగం సక్సెస్!


తన భూభాగం మీదకు దూసుకువచ్చే శత్రు క్షిపణులను భారత్ భూతలం నుంచే సమర్ధవంతంగా తిప్పికొట్టగలదు. ఈ మేరకు ఇజ్రాయెల్ తో సంయుక్తంగా అభివృద్ది చేసిన బరాక్-8 క్షిపణిని భారత్ విజయవంతంగా ప్రయోగించింది. ఒడిశా తీరంలోని చాందీపూర్ ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజీ(ఐటీఆర్) నుంచి నేటి ఉదయం సరిగ్గా 8.16 గంటలకు భారత్ ప్రయోగించిన బరాక్-8 విజయవంతంగా లక్ష్యాన్ని ఛేదించింది. దాదాపు 70 కిలో మీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించే సత్తా కలిగిన ఈ క్షిపణి 60 కిలోల బరువుండే ఆయుధాన్ని ప్రయోగించగలదు.

  • Loading...

More Telugu News