: కోటీశ్వరుల జాబితాలో మలాలా... ఒక్కో ప్రసంగానికి రూ.కోటి తీసుకుంటున్న వైనం


మలాలా యూసుఫ్ జాయ్ పేరు గుర్తుందా? పాకిస్థాన్ కు చెందిన ఈ బాలిక పేరు తెలియనవారు ప్రపంచంలో దాదాపుగా ఎవరూ ఉండరు. పాకిస్థాన్ లో తాలిబన్ ఉగ్రవాదులకు ఎదురొడ్డి నిలిచి బాలికా విద్యకు దన్నుగా నిలిచి నోబెల్ శాంతి బహుమతి గెలుచుకున్న మలాలా పేరు మరచిపోవడం కూడా అంత తేలిక కాదు. చిన్న వయసులోనే నోబెల్ బహుమతి సాధించిన ఈ బాలిక... ప్రస్తుతం కోటీశ్వరుల జాబితాలో చేరిపోయింది. ప్రస్తుతం పలు దేశాల్లో పర్యటిస్తున్న మలాలా... ఒక్క ప్రసంగం చేసేందుకు ఏకంగా రూ.కోటి తీసుకుంటోందని ఓ బ్రిటన్ పత్రిక ఆసక్తికర కథనం రాసింది. అంతేకాకేండా ‘ఐ యామ్ మలాలా’ పేరిట ఆమె రాసిన పుస్తకం ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 18 లక్షల కాపీల మేర అమ్ముడుబోయింది. వెరసి ఈ పుస్తకాన్ని ప్రచురించిన సంస్థకు రూ.20 కోట్ల మేర ఆదాయం సమకూరింది. ఈ సంస్థలో మలాలా తల్లిదండ్రులు భాగస్వాములుగా ఉన్నారు. వెరసి మాలాలా పుస్తకం ద్వారా వచ్చిన ఆదాయంలో ఆమె కుటుంబానికి కూడా పెద్ద మొత్తంలో వాటా దక్కిందని ఆ పత్రిక పేర్కొంది.

  • Loading...

More Telugu News