: జనారణ్యంలో దుప్పిని వేటాడిన చిరుతపులి... ఫోటోలు, వీడియోలు తీసిన తిరుమల భక్తులు


ఇటీవలి కాలంలో సరైన ఆహారం లభించక, తిరుమల గిరుల్లో అడవులను వీడి జనారణ్యంలోకి వచ్చి సీసీ కెమెరాలకు పలుమార్లు చిరుతలు చిక్కిన సంగతి తెలిసిందే. ఇక గత రాత్రి తిరుమలలో స్థానికులు నివసించే బాలాజీనగర్ ప్రాంతంలోకి వచ్చిన ఓ చిరుత ఏకంగా దుప్పిని వేటాడగా, దాన్ని చూసిన పలువురు భక్తులు, ఫోటోలు, వీడియోలు తీశారు. ఈ దృశ్యాలు నేటి ఉదయం నుంచి టీవీ చానళ్లలో వైరల్ అవుతున్నాయి. కౌస్తుభం అతిథి గృహం వెనుకవైపు ప్రాంతంలోని అడవిలో నుంచి ఓ దుప్పి రాగా, దాన్ని వేటాడుతూ ఓ చిరుతపులి వచ్చింది. జన సందడితో చిరుత ఓ చిన్న వాటర్ ట్యాంకు వెనక నక్కింది. భక్తుల అలికిడితో గర్జించింది. దీన్ని తమ వాహనాల నుంచే పలువురు వీడియో తీసుకున్నారు. కాగా, తిరుమలకు చిరుతపులులు రాకుండా అధికారులు ఎన్ని చర్యలు చేపడుతున్నా విఫలమవుతున్నాయన్న విమర్శలు పెరుగుతున్నాయి.

  • Loading...

More Telugu News