: ముంబైలో భారీ అగ్నిప్రమాదం.. 8 మంది మృతి
ముంబైలో కొద్దిసేపటి క్రితం ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. అంధేరి ప్రాంతంలో ఓ భవనంలోని మెడికల్ షాపులో ఒక్కసారిగా మంటలు ఎగసిపడ్డాయి. ప్రాథమిక సమాచారం ప్రకారం ఈ ప్రమాదంలో 8 మంది మృతి చెందారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. షార్ట్ సర్కూట్ కారణంగా ప్రమాదం జరిగినట్టు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు అందాల్సి ఉంది.