: గుంటూరులో అరణ్య భవన్ కు తొలగిన అడ్డంకి!... ‘సంకురాత్రి రెసిడెన్సీ’లో నేడు ప్రారంభం!


నవ్యాంధ్ర నుంచే ఏపీ పాలన సాగాలన్న చంద్రబాబు సర్కారు నిర్ణయంతో గుంటూరు తరలివెళ్లేందుకు సిద్ధపడ్డ అటవీ శాఖ ప్రధాన కార్యాలయం ‘అరణ్య భవన్’కు ఆదిలోనే ఆటంకాలు ఎదురయ్యాయి. అమరావతి పరిధిలోని ఉండవల్లికి చెందిన ఎస్వీఆర్ టవర్స్ ను అటవీ శాఖ అధికారులు అద్దెకు తీసుకున్నారు. ఈ మేరకు అటవీ శాఖతో ఒప్పందం కుదుర్చుకున్న భవన యజమాని... సదరు భవంతికి ‘అరణ్య భవన్’ అనే బోర్డు తగిలించేందుకు ససేమిరా అన్నారు. దీంతో సదరు ఒప్పందాన్ని రద్దు చేసుకున్న అటవీ శాఖ... ఆ తర్వాత గుంటూరులోని అమరావతి జంక్షన్ సమీపంలో ఉన్న ‘సంకురాత్రి టవర్స్’ ను అద్దెకు తీసుకుంది. ఈ మేరకు ఇప్పటికే భవన యజమానితో ఒప్పందం కుదుర్చుకున్న అటవీ శాఖ... నేడు అందులో ‘అరణ్య భవన్’ను ప్రారంభించనుంది.

  • Loading...

More Telugu News