: ఏపీ ఉద్యోగుల ఉత్సాహం!... పంద్రాగస్టు వేడుకలు వెలగపూడిలోనేనన్న సీఎస్ టక్కర్!


సొంత రాష్ట్రం నుంచే పాలన మొదలైన నేపథ్యం... నవ్యాంధ్ర ఉద్యోగులను సంభ్రమాశ్చర్యాలకు గురి చేసింది. అప్పటిదాకా హైదరాబాదు నుంచి అమరావతికి తరలడానికి తటపటాయించిన ఉద్యోగులు... చంద్రబాబు సర్కారు యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టడం, నియమ నిబంధనలను పాటించక తప్పని వైనం వారిని అమరావతి బాట పట్టించింది. నిన్న ఐదో బ్లాకులో తాత్కాలిక సచివాలయం లాంఛనంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా హైదరాబాదు నుంచి ఐదు బస్సుల్లో వచ్చిన సెక్రటేరియట్ ఉద్యోగులు జోరుగా వర్షం కురుస్తున్నా ముందడుగే వేశారు. సచివాలయ ప్రారంభోత్సవంలో పాలుపంచుకున్నారు. ఉద్యోగుల ఉత్సాహాన్ని చూసిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ టక్కర్... ఈ దఫా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను వెలగపూడిలోనే నిర్వహిస్తామని మరింత ఉత్సాహంగా ప్రకటించారు.

  • Loading...

More Telugu News