: నేపాల్ లో వరుస భూ ప్రకంపనలు


మన పొరుగు దేశమైన నేపాల్ లో వరుస భూ ప్రకంపనలు సంభవించాయి. పశ్చిమ నేపాల్ లోని బాజ్ హంగ్ జిల్లాలో సంభవించిన భూ ప్రకంపనల తీవ్రత రిక్టర్ స్కేల్ పై వరుసగా 5, 4 గా నమోదయ్యాయి. భూ ప్రకంపనలతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. అయితే, ఎలాంటి నష్టం సంభవించలేదని సంబంధిత అధికారులు పేర్కొన్నారు. కాగా, గత ఏడాది సంభవించిన భారీ భూకంపంతో నేపాల్ భారీగా దెబ్బతిన్న విషయం తెలిసిందే.

  • Loading...

More Telugu News