: నేతాజీకు సంబంధించిన మరిన్ని ఫైల్స్ విడుదల


స్వాతంత్ర్య సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ కు చెందిన మరిన్ని ఫైల్స్ ను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. తాజాగా విడుదల చేసిన 25 ఫైల్స్ లో కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ నుంచి 14, క్యాబినెట్ సెక్రటేరియట్ నుంచి 9, ప్రధాన మంత్రి కార్యాలయం (పీఎంఓ) నుంచి 2 ఫైళ్లు ఉన్నాయి. ఐదో విడతగా విడుదల చేసిన ఈ కొత్త ఫైల్స్ ను సంబంధిత వెబ్ సైట్ లో ప్రభుత్వం పొందుపరిచింది. కాగా, ఇప్పటివరకు బోస్ కు సంబంధించిన 225 ఫైల్స్ ను ప్రభుత్వం విడుదల చేసింది. జనవరి 23న నేతాజీ 119వ జయంతి సందర్భంగా ఆయనకు సంబంధించిన ఫైల్స్ ను విడుదల చేసే కార్యక్రమాన్ని ప్రధాని మోదీ ప్రారంభించిన విషయం తెలిసిందే.

  • Loading...

More Telugu News