: దిగ్భ్రాంతికరం... 'నిర్భయ' దోషి ఐఎస్ఐఎస్ సానుభూతిపరుడు?


దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసే వాస్తవం మరోసారి వెలుగు చూసింది. 2012లో దేశం మొత్తాన్ని ఆగ్రహానికి గురి చేసిన నిర్భయ కేసులో అత్యంత క్రూరుడైన వ్యక్తిగా నిర్ధారణ అయిన బాల నేరస్థుడు ఐఎస్ఐఎస్ సానుభూతిపరుడని తెలుస్తోంది. జువైనల్ అన్న కారణంగా అతనిని విడుదల చేయడం సరికాదంటూ డిమాండ్ చేసిన మహిళా సంఘాల వాదనకు బలం చేకూరుస్తూ, నిఘా వర్గాలు అతనికి ఐఎస్ఐఎస్ తో సంబంధాలు ఉన్నాయని చెబుతున్నాయి. జువైనల్ హోంలో ఉండగానే ఆ నేరగాడికి కాశ్మీరీ జిహాదీల్లో చేరాలనే ఆలోచన ఉండేదని నిఘా వర్గాలు చెబుతున్నాయి. బాల నేరస్థుడిగా జువైనల్ హోంలో మూడు సంవత్సరాల నిర్బంధ శిక్ష అనుభవిస్తున్నప్పుడే, కాశ్మీరీ యువత అతనిలో తీవ్రవాద ఆలోచనలు రేకెత్తించారని భద్రతాధికారులు తెలిపారు. ఈ మేరకు ప్రభుత్వానికి నివేదిక కూడా ఇచ్చారు. అయినప్పటికీ ఆ దుర్మార్గుడు 2015 డిసెంబర్ లో జువైనల్ హోం నుంచి విడుదలయ్యాడు. తరువాత ఉత్తరప్రదేశ్ నిఘా వర్గాలు అతని అనుమానాస్పద కదలికలు గుర్తించి ఉన్నతాధికారులకు తెలిపాయి. దీంతో అతని కదలికలను సునిశితంగా గమనించిన అధికారులు, అతనికి ఐఎస్ఐఎస్ తో సంబంధాలున్నాయని గుర్తించారు. దీంతో అతనిపై మరింత నిఘా పెట్టారు.

  • Loading...

More Telugu News