: సెక్షన్ 30 సవరణపై కేసీఆర్ పట్టుబట్టాలి: జస్టిస్ చంద్రకుమార్


పునర్విభజన చట్టంలోని సెక్షన్ 30 సవరణపై కేసీఆర్ పట్టుబట్టాలని, అలా చేయనంత వరకు తెలంగాణకు సొంతంగా హైకోర్టు రాదని జస్టిస్ చంద్రకుమార్ అన్నారు. తెలంగాణలో జడ్జిల తాజా వివాదంపై ఒక ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్యూలో ఆయన మాట్లాడుతూ, తెలంగాణలో హైకోర్టు ఏర్పాటుపై ప్రధాన పాత్ర ప్రభుత్వానిదేనని, సెక్షన్ 30లో సవరణ కోరితే తప్ప ఈ సమస్యకు పరిష్కారం లేదని అన్నారు. హైకోర్టును విభజించమని కేసీఆర్, మరికొందరు అంటున్నారని, తొలుత పునర్విభజన చట్టంలో సెక్షన్ 30 పై సవరణ కోరాలని, అప్పటికీ స్పందించకపోతే, కేంద్రానిదే బాధ్యత అని అన్నారు. జడ్జిల ఆప్షన్స్ విషయంలో చీఫ్ జస్టిస్ ది తప్పులేదని, సెక్షన్ 30లో లోపమే దానికి కారణమని అన్నారు. సెక్షన్ 30 ప్రకారం ఏపీ హక్కును ప్రశ్నించలేమని, కొత్త హైకోర్టు నిర్మించేంత వరకు ఉమ్మడి సేవలు తప్పవన్నారు. సెక్షన్ 30లో లోపం ఏపీ సీఎం పాలిట ప్లస్ గా మారిందని, అన్నింటికీ పరిష్కారం సెక్షన్ 30లో సవరణేనని, పార్లమెంట్ సమావేశాల ద్వారానే ఇది సాధ్యమని, లేదంటే రాష్ట్రపతి ప్రత్యేక ఆర్డినెన్స్ కు ప్రయత్నించవచ్చని అన్నారు. జడ్జిలు రోడ్లపైకి రావడం బాధాకరమని, న్యాయవృత్తి అనేది హుందాతనంతో కూడుకున్నదని, న్యాయపరంగా పోరాడితే తప్పక న్యాయం దొరుకుతుందని జస్టిస్ చంద్రకుమార్ అన్నారు.

  • Loading...

More Telugu News