: మోదీని హేళన చేస్తూ రాసిన పుస్తకాన్ని నిషేధించేందుకు నిరాకరించిన న్యాయస్థానం
ప్రధాని నరేంద్ర మోదీని అవహేళన చేస్తూ రాసిన పుస్తకాన్ని నిషేధించాలంటూ సామాజిక కార్యకర్త నరసిన్హా సోలంకీ గుజరాత్ కోర్టును ఆశ్రయించారు. దీనిని విచారించిన న్యాయస్ధానం రాజ్యాంగంలోని ఆర్టికల్ 19 ప్రకారం ఒక వ్యక్తి భావవ్యక్తీకరణ స్వేచ్ఛను హరించలేమని స్పష్టం చేసింది. దీంతో ఈ పుస్తకం నిషేధించాలంటూ దాఖలైన పిటిషన్ ను గుజరాత్ కోర్టు తిరస్కరించింది. కాంగ్రెస్ పార్టీకి చెందిన రచయిత జయేష్ షా ఈ పుస్తకాన్ని రచించారు. 2014 ఎన్నికల సందర్భంగా మోదీ ఇచ్చిన హామీలను ఈ పుస్తకంలో ప్రస్తావించారు. ఈ హామీలు నెరవేర్చలేదని గుర్తు చేస్తూ, మోదీ సమర్ధతను ఆయన ఎత్తిచూపారు. దీంతో ప్రధాని మోదీని హేళన చేశారని, ఆయన పరువుకు భంగం కలిగించేలా ఉన్న ఈ పుస్తకాన్ని నిషేధించాలని, ప్రధానిగా మోదీ అధికారంలోకి వచ్చి రెండేళ్ళు మాత్రమే అయిందని, ఆయన ఇచ్చిన హామీలు నెరవేర్చేందుకు మరింత సమయం పడుతుందని ఈ పిటిషన్ లో పేర్కొన్నారు.