: రవిశాస్త్రి వ్యాఖ్యలు బాధించాయి: గంగూలీ


టీమిండియా మాజీ డైరెక్టర్ రవిశాస్త్రి తనపై చేసిన వ్యాఖ్యలు బాధించాయని టీమిండియా సలహాదారు కమిటీ సభ్యుడు, బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ తెలిపాడు. కోల్ కతాలో రవిశాస్త్రి వ్యాఖ్యల వివాదంపై గంగూలీ మాట్లాడుతూ, బీసీసీఐ అనుమతి తీసుకునే తాను క్యాబ్ (క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్) సమావేశానికి వెళ్లానని చెప్పాడు. అంతే తప్ప తనకు అప్పగించిన బాధ్యతలను వదిలించుకోవాలని కాదని స్పష్టం చేశాడు. తనపై లేనిపోని వ్యాఖ్యలు చేస్తున్న రవిశాస్త్రి టీమిండియా ప్రధాన కోచ్ పదవి కావాలనుకున్నప్పుడు హాలీడే పేరిట విదేశాలకు ఎందుకు వెళ్లాడని ఆయన ప్రశ్నించారు. వ్యక్తిగత విమర్శలు సరికాదని, వాటి వల్ల ఉపయోగం ఉండదని గంగూలీ హితవు పలికాడు.

  • Loading...

More Telugu News