: ఫీ‘జులుం’ ఇక ఉండదు.. రాష్ట్ర వ్యాప్తంగా 162 స్కూళ్లకు నోటీసులు ఇస్తున్నాం: కడియం
అధిక ఫీజులు వసూలు చేస్తూ విద్యార్థుల తల్లిదండ్రులను ఇబ్బంది పెడుతోన్న కార్పోరేట్ స్కూళ్లపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలంగాణ ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. తెలంగాణ వ్యాప్తంగా 162 స్కూళ్లకు నోటీసులు ఇస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కోసం ప్రతీ నియోజకవర్గానికీ రూ.5 కోట్ల రూపాయల నిధులు కేటాయిస్తున్నట్లు ఆయన తెలిపారు. వచ్చేనెల చివరినాటికి యూనివర్సిటీలకు ఉపకులపతులను నియమిస్తామని కడియం శ్రీహరి అన్నారు. నాణ్యమైన విద్యను అందించే అంశానికి తమ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని చెప్పారు.