: హెచ్ఐసీసీ వద్ద డీఎస్సీ అభ్యర్థుల ఆందోళన
హైదరాబాద్‌లోని హెచ్ఐసీసీ వద్ద ఈరోజు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఉపాధ్యాయ నియామకాల అంశంపై 1998, 2002, 2008, 2011 డీఎస్సీ అభ్యర్థులు ఆందోళనకు దిగారు. దీంతో అక్కడ ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఆందోళనకు దిగిన డీఎస్సీ అభ్యర్థుల్లో పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రభుత్వ తీరుకి వ్యతిరేకంగా అభ్యర్థులు నినాదాలు చేసినట్లు తెలుస్తోంది. హెచ్‌ఐసీసీలో ఈరోజు టీఆర్‌ఎస్ పార్లమెంటరీ, శాసనసభాపక్ష సమావేశం కొనసాగిన విషయం తెలిసిందే.