: జగన్ పత్రికలో తప్పుడు కథనాలు ప్రచురిస్తున్నారు: మంత్రి చినరాజప్ప
నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో జరుగుతున్న నిర్మాణ పనులపై జగన్ పత్రికలో తప్పుడు కథనాలు ప్రచురితమవుతున్నాయంటూ ఏపీ ఉపముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప మండిపడ్డారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఆ పత్రికలో ప్రచురితమవుతున్న కథనాల్లో ఎటువంటి వాస్తవం లేదని, తాత్కాలిక సచివాలయం నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయని అన్నారు. అమరావతికి ఉద్యోగులు తరలి రావడం చాలా సంతోషంగా ఉందని, ఉద్యోగులకు రాజధాని రైతులు స్వాగతం పలికారని చెప్పారు.