: గోవాలో సెక్స్ టూరిజం... దగ్గరుండి ప్రోత్సహిస్తున్న నేతలు: కేజ్రీవాల్ నిప్పులు


డ్రగ్స్ మాఫియా, సెక్స్ టూరిజంకు గోవా అడ్డాగా మారిందని, దీనికి ఇక్కడున్న రాజకీయ పార్టీల నేతలూ కారణమని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నిప్పులు చెరిగారు. గోవా పర్యాటకంగా తెచ్చుకున్న పేరును ఈ పరిస్థితులు మసకబారుస్తున్నాయని, అయినా, నేతలకు చీమ కుట్టినట్లయినా లేదని విమర్శించారు. ప్రస్తుతం గోవా పర్యటనలో ఉన్న ఆయన, హోటళ్లు, టూరిజం వ్యాపారులతో జరిగిన సమావేశంలో మాట్లాడారు. గోవా పర్యాటకానికి చెడ్డ పేరు తెస్తున్న పనులను నిలిపివేయాల్సిన అవసరం ఉందని అన్నారు. కాగా, వచ్చే ఏడు గోవా అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తరుణంలో 'గోవా డైలాగ్స్' పేరిట ఆమ్ ఆద్మీ వివిధ వర్గాల ప్రజలతో సమావేశాలు నిర్వహిస్తోంది. ఇక ఈ సమావేశాల్లో వచ్చిన సూచనలను బట్టి పార్టీ మ్యానిఫెస్టో రూపొందించాలన్నది కేజ్రీవాల్ మనసులోని ఆలోచన.

  • Loading...

More Telugu News