: ప్రతిష్టాత్మక అవార్డు అందుకోనున్న గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్


భారత సంతతికి చెందిన గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ కు అత్యంత ప్రతిష్టాత్మక అవార్డు ‘గ్రేట్ ఇమ్మిగ్రేట్స్: ది ప్రైడ్ ఆఫ్ అమెరికా’ లభించింది. వ్యక్తిగతంగా, వృత్తి రీత్యా గొప్ప విజయాలు సాధించి స్ఫూర్తిగా నిలిచే వారికి ప్రతి ఏటా కార్నీజియా కార్పొరేషన్ అనే సంస్థ అవార్డులను అందజేస్తూ ఉంటుంది. అందులో భాగంలో ఈ ఏడాది భారత సంతతికి చెందిన నలుగురు వ్యక్తులతో పాటు ప్రపంచ వ్యాప్తంగా అమెరికాకు వలస వచ్చిన 30 దేశాలకు చెందిన 42 మందిని ఈ అవార్డుకు ఎంపిక చేసింది. పిచాయ్ తో పాటు మరో ముగ్గురు ప్రవాస భారతీయులు పీబీఎస్ న్యూస్ అవర్ ప్రఖ్యాత వ్యాఖ్యాత, సీనియర్ కరస్పాండెంట్ హరి శ్రీనివాసన్, మెకన్సీ అండ్ కంపెనీ చైర్మన్ విక్రమ్ మల్హోత్రా, నేషనల్ క్రిటిక్ సర్కిల్ అవార్డు విజేత, రచయిత భారతీ ముఖర్జీలను కూడా ఈ అవార్డుతో అమెరికా సత్కరించనుంది. న్యూయార్క్ లో రేపు నిర్వహించే ఒక కార్యక్రమంలో కార్నీజియా కార్పొరేషన్ ఈ అవార్డులను బహూకరించనుంది.

  • Loading...

More Telugu News