: జాతీయ పతాకంపై కూర్చున్న మోదీ దానితోనే చేతులు తుడుచుకున్నారట!... ముజఫర్ నగర్ కోర్టులో పిటిషన్!


అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా జాతీయ పతాకాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అగౌరవపరిచారని, జాతీయ పతాకాన్ని ఓ చిన్న గుడ్డ ముక్కగా పరిగణించిన ప్రధాని దానిని కింద పరుచుకుని కూర్చోవడమే కాకుండా పతాకంతో చేతులు తుడుచుకున్నారని ఆరోపిస్తూ బీహార్ కు చెందిన ప్రకాశ్ కుమార్ అనే వ్యక్తి ప్రధానిపై ముజఫర్ నగర్ లోని చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనికి సంబంధించిన ఫొటోలను ఇంటర్నెట్ నుంచి సేకరించి తన పిటిషన కు జోడించారు. ఈ పిటిషన్ ను విచారణకు స్వీకరించిన కోర్టు ప్రధానిపై కేసు నమోదు చేసిందని పిటిషనర్ తరఫు న్యాయవాది కొద్దిసేపటి క్రితం సంచలన ప్రకటన చేశారు. పిటిషన్ పై తదుపరి విచారణను వచ్చే నెల 16కు వాయిదా వేసినట్లు ఆయన పేర్కొన్నారు. మోదీ చర్యలు జాతీయ పతాకాన్ని అవమానపరిచేవిగానే ఉన్నాయని పిటిషనర్ కోర్టుకు తెలిపారు.

  • Loading...

More Telugu News