: బాబు నాయకుడు కాదు.. ఖల్ నాయక్: షర్మిల
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నాయకుడు కాదని ఖల్ నాయక్ అని వైఎస్సార్సీపీ నేత షర్మిల అన్నారు. ప్రస్తుతం ఆమె ఖమ్మం జిల్లాలో పాదయాత్ర చేస్తున్నారు. జిల్లాలోని శివాయి గూడెం వద్ద ఆమె వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ప్రజల పాలిట దుర్మార్గంగా వ్యవహరిస్తున్న కాంగ్రెస్ సర్కారును బాబే కాపాడుతున్నాడని ఆరోపించారు. త్వరలోనే జగనన్న బైటికి వస్తాడని, తద్వారా రాజన్న రాజ్యం సాకారమవుతుందని షర్మిల చెప్పుకొచ్చారు.