: వ‌చ్చేనెల 18 నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు.. జీఎస్‌టీ బిల్లు ఆమోదానికి కేంద్రం క‌స‌రత్తు


కేంద్రమంత్రి రాజ్నాథ్సింగ్ ఆధ్వర్యంలో పార్లమెంటరీ వ్యవహారాల మంత్రివర్గ ఉప సంఘం ఈరోజు ఢిల్లీలో భేటీ అయింది. జులై 18వ తేదీ నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు నిర్వ‌హించాల‌ని భేటీలో నిర్ణ‌యించిన‌ట్లు కేంద్ర మంత్రి వెంక‌య్య‌నాయుడు ఈ సంద‌ర్భంగా మీడియాకు తెలిపారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఆగ‌స్టు 12 వ తేది వ‌ర‌కు కొన‌సాగుతాయ‌ని ఆయ‌న తెలిపారు. జీఎస్‌టీ బిల్లు ఆమోదం పొందేందుకు, స‌మావేశాలు స‌జావుగా సాగేందుకు ప్ర‌తిప‌క్షాలు స‌హ‌క‌రించాల‌ని వెంకయ్యనాయుడు కోరారు. జీఎస్‌టీ బిల్లు ఆమోదం పొందేందుకు అన్ని పార్టీల‌తో మ‌రోసారి చ‌ర్చించ‌నున్న‌ట్లు, ఆయా పార్టీల నేత‌ల‌తో వ్య‌క్తిగ‌తంగానూ మాట్లాడేందుకు సిద్ధ‌మేన‌ని ఆయన తెలిపారు. పెండింగ్‌లో ఉన్న బిల్లుల ఆమోదానికి స‌హ‌క‌రించాల‌ని ఆయ‌న కోరారు. రాజ్యసభలో 45, లోక్సభలో 25 బిల్లులు పెండింగ్లో ఉన్నాయ‌ని ఈ సంద‌ర్భంగా తెలిపారు. ప్ర‌తిప‌క్షాలు పార్ల‌మెంట్‌లో సంధించే ప్ర‌శ్న‌ల‌కు తాము దీటుగా స‌మాధానం చెబుతామ‌ని ఆయ‌న అన్నారు.

  • Loading...

More Telugu News