: జగ్దానీ, ఇబ్రహీం సోదరులే కీలకం..?...హైదరాబాద్‌లో ఉగ్రవాదుల అరెస్టులతో వెలుగులోకొస్తున్న నిజాలు
హైదరాబాద్‌లోని పాతబస్తీ నుంచి సిరియాలోని ఐఎస్ ప్రధాన కార్యాలయంతో పలువురు సంప్రదింపులు జరుపుతున్నట్లు పాతబస్తీ పరిసర ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తోన్న ఎన్ఐఏ అధికారులు స్పష్టం చేశారు. ఇంటెలిజెన్స్ బ్యూరో హెచ్చరికతో ఈరోజు జరిపిన సోదాల్లో ఇప్పటివరకు 13 మంది ఉగ్ర అనుమానితులను అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. వీరిలో తలాబ్‌కట్ట ప్రాంతానికి చెందిన మహ్మద్ ఇలియాస్ జగ్దానీ, మహ్మద్ ఇలియాస్ ఇబ్రహీం అనే సోదరులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిరువురే హైదరాబాద్‌లో ఉగ్రవాద చర్యలకు కీలకంగా ఉన్నట్లు ఎన్ఐఏ అధికారులు భావిస్తున్నారు. మొత్తం 13 మంది నుంచి ఇప్పటివరకు 15 లక్షల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.