: బురిడీ బాబా వలకు చిక్కిన ఐఏఎస్!... రూ.50 లక్షలు పోయినా పరువు పోతుందని నోరెత్తని వైనం!


బురిడీ బాబాగా తెలుగు మీడియా పిలుస్తున్న నయా మోసగాడు శివానంద లీలలు మరిన్ని వెలుగులోకి వచ్చాయి. హైదరాబాదులోని లైఫ్ స్టైల్ భవనం యజమాని మధుసూదన్ రెడ్డి కుటుంబానికి మత్తు పదార్థమిచ్చి రూ.1.33 కోట్లు కొల్లగొట్టిన శివానంద ప్రస్తుతం పోలీసుల కస్టడీలో ఉన్నాడు. విచారణలో భాగంగా అతడు మరిన్ని కీలక విషయాలు బయటపెట్టాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన శివానంద లీలల విషయానికొస్తే... ఏపీ కేడర్ కు చెందిన ఓ సీనియర్ ఐఏఎస్ అధికారిని కూడా శివానంద బుట్టలో వేసుకున్నాడు. శివానంద మాయమాటలు నమ్మిన ఆ ఐఏఎస్ అధికారి బురిడీ బాబాకు రూ.50 లక్షలు సమర్పించుకున్నాడట. చేతిలో డబ్బులు పడగానే మాయమైన బురిడీ బాబా తనను నిలువునా ముంచాడని గుర్తించినా... ఎక్కడ పరువు పోతుందోనన్న భయంతో ఆ ఐఏఎస్ అధికారి నోరు విప్పేందుకు భయపడుతున్నారట.

  • Loading...

More Telugu News