: ఇంకెంత మంది ఉన్నారో?... 13కు చేరిన పట్టుబడ్డ ఉగ్రవాదుల సంఖ్య!


భాగ్యనగరి హైదరాబాదులో విధ్వంసం సృష్టించేందుకు ఐఎస్ఐఎస్ ముష్కరులు భారీ పథకమే పన్నినట్లు ఉంది. నిన్న రాత్రి హైదరాబాదులోని పాతబస్తీలో ముమ్మర సోదాలు మొదలుపెట్టిన జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అధికారులు ఇప్పటిదాకా 13 మంది అనుమానిత ఉగ్రవాదులను అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాదులో విధ్వంసం సృష్టించేందుకు ఐఎస్ తీవ్రవాదులు ఇప్పటికే రంగంలోకి దిగారన్న ఇంటెలిజెన్స్ బ్యూరో హెచ్చరికతో రంగంలోకి దిగిన ఎన్ఐఏ అధికారులు పాతబస్తీలోని చాంద్రాయణగుట్ట, భవానీ నగర్, మొఘల్ పురా, మీర్ చౌక్, తలాబ్ కట్టా, బార్కస్ తదితర ప్రాంతాల్లో ముమ్మర సోదాలు చేసిన 10 మంది ఉగ్రవాదులను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. విచారణలో ఉగ్రవాదులిచ్చిన సమాచారంతో పాతబస్తీకే చెందిన హఫీజ్ బాబా నగర్, షాలిబండ, హుస్సేనీ ఆలం ప్రాంతాల్లోనూ సోదాలు చేసి మరో ముగ్గురు ఉగ్రవాదులను అదుపులోకి తీసుకున్నారు. దీంతో పోలీసులకు పట్టుబడ్డ ఉగ్రవాదుల సంఖ్య 13కు చేరింది. సోదాలు చేస్తున్న కొద్దీ పట్టుబడుతున్న ఉగ్రవాదుల సంఖ్య పెరుగుతుండటంతో ఇంకెంత మంది ఉగ్రవాదులు నగరంలో ఉన్నారోనన్న భయాందోళనలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో నగరవ్యాప్తంగా హైఅలర్ట్ ప్రకటించిన ఎన్ఐఏ అధికారులు స్థానిక పోలీసుల సహకారంతో మరింత ముమ్మరంగా సోదాలు చేస్తున్నారు.

  • Loading...

More Telugu News