: హైదరాబాద్‌లో ఒక్క ఏడాదిలో 62వేల మంది రక్తాన్ని కళ్లజూసిన శునకాలు


భాగ్యనగరంలో కుక్కల స్వైరవిహారంతో వీధుల్లోకి రావాలంటేనే ప్రజలు భయపడే పరిస్థితి నెలకొంది. రోజూ ఎక్కడో ఓ చోట అవి దాడులకు తెగబడుతూనే ఉన్నాయి. వీటి బారిన పడిన బాధితులు ఆస్పత్రులకు పరుగులు పెడుతున్నారు. రాజధానిలో శునకాల దాడులపై నారాయణగూడలోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్స్ తాజాగా నిర్వహించిన సర్వేలో వెల్లడైన విషయాలు వెన్నులో వణుకు పుట్టిస్తున్నాయి. 2015-16 సంవత్సరంలో 61,749 మందిపై కుక్కలు దాడిచేసి గాయపరిచినట్టు సర్వే తేల్చింది. ప్రైవేటు ఆస్పత్రులలో చేరిన వారిని కూడా కలిపితే ఈ సంఖ్య మరింత పెరుగుతుందని పేర్కొంది. తాజాగా మంగళవారం ఉదయం బండ్లగూడలో మూడేళ్ల చిన్నారి అమానుల్లాపై కుక్క దాడిచేసి అతడి తలను చీల్చేసినంత పనిచేసింది. చుట్టుపక్కల వారు అప్రమత్తం కావడంతో బాలుడు ప్రాణాలతో బయటపడ్డాడు. ప్రస్తుతం నల్లకుంటలోని ఫీవర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.

  • Loading...

More Telugu News