: నారాయణ స్కూల్ బస్సులో మంటలు!... స్థానికుల అప్రమత్తతతో తప్పిన పెను ముప్పు!
తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ కార్పొరేట్ పాఠశాలగా పేరుగాంచిన నారాయణ స్కూల్ బస్సుకు నేటి ఉదయం పెద్ద ప్రమాదమే తప్పింది. పాఠశాలకు పిల్లలను తీసుకొచ్చేందుకు వెళ్లిన ఆ స్కూల్ కు చెందిన ఓ బస్సులో ఉన్నట్లుండి మంటలు చెలరేగాయి. అయితే ఈ మంటలను చూసిన స్థానికులు వేగంగా స్పందించడంతో పెద్ద ముప్పే తప్పింది. ఈ ఘటన చిత్తూరు జిల్లాలో నేటి ఉదయం చోటుచేసుకుంది. ప్రమాదం జరిగే సమయానికి బస్సుల్లో పిల్లలు ఎవరూ లేకపోవడంతో పాటు మంటలు మరింత మేర విస్తరించకముందే స్థానికులు వేగంగా స్పందించడంతో ప్రమాదం తప్పింది. బస్సులో మంటలు చెలరేగడానికి గల కారణాలు తెలియరాలేదు.