: రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో టికెట్ కన్ఫర్మ్ కాలేదా.. ఎయిరిండియా విమానంలో ఎగిరిపోండి!


రాజధాని ఎక్స్‌ప్రెస్ రైళ్లలో ప్రయాణించే వారికి ఇది శుభవార్తే. టికెట్ కన్ఫర్మ్ కాలేదని ఇక బాధపడాల్సిన పనిలేదు. ఇక నుంచి ఎంచక్కా ఎయిర్ ఇండియా విమానంలో గమ్యం చేరుకోవచ్చు. రాజధాని రైళ్లలోని ఫస్ట్ ఏసీ టికెట్ ధరలు, విమాన చార్జీలతో సరిపోలడంతో ఎయిర్ ఇండియా ఈ నిర్ణయం తీసుకుంది. ప్రత్యేక పథకం కింద పరిమిత కాలం వరకు ఈ సేవలు అందించనుంది. టికెట్ కన్ఫర్మ్ కాని రాజధాని రైలు ప్రయాణికులు విమానం బయలుదేరడానికి నాలుగు గంటల ముందు టికెట్లు బుక్ చేసుకోవచ్చని మంగళవారం ఎయిరిండియా పేర్కొంది. సూపర్ సేవర్ స్కీం కింద ఈ సేవలు అందించనున్నట్టు తెలిపింది. జూన్ 26 నుంచి సెప్టెంబరు 30 వరకు ఈ పథకం అందుబాటులో ఉంటుందని పేర్కొంది. ప్రస్తుతం రైల్వేశాఖ 21 రాజధాని ఎక్స్‌ప్రెస్‌లను నడుపుతోంది. రోజూ 20 వేల మంది వీటిలో ప్రయాణిస్తున్నారు. ‘‘వేలాదిమంది టికెట్‌లు కన్ఫర్మ్ కాక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో ఈ ఖాళీని పూరించాలని ఎయిరిండియా నిర్ణయించింది. ఇక నుంచి టికెట్‌ దొరకని వారు అదే ఖర్చుతో అంతకంటే తక్కువ సమయంలో వారి గమ్యాలకు చేరుకోవచ్చు’’ అని సంస్థ పేర్కొంది.

  • Loading...

More Telugu News