: కేశినేని సారీ చెప్పరు!... వంగవీటి డిమాండ్ ను కొట్టిపారేసిన బోండా!


గోశాల నిర్వాహకులను దుర్భాషలాడిన విజయవాడ ఎంపీ కేశినేని నాని క్షమాపణలు చెప్పి తీరాల్సిందేనంటున్న వైసీపీ నేత వంగవీటి రాధా డిమాండ్ పై టీడీపీ నేత, విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు కొద్దిసేపటి క్రితం విజయవాడలో మీడియాతో మాట్లాడిన బోండా... వంగవీటి రాధా డిమాండ్ సరైంది కాదన్నారు. గోశాల నిర్వాహకులే కాదు కదా, ఏ ఒక్కరిని కూడా కేశినేని దుర్భాషలాడలేదని ఆయన వివరణ ఇచ్చారు. ఎవరినీ పల్లెత్తు మాట అనని కేశినేని సారీ ఎందుకు చెబుతారని ప్రశ్నించిన బోండా... తమ పార్టీ నేత క్షమాపణ చెప్పేది లేదని తేల్చిచెప్పారు.

  • Loading...

More Telugu News