: 11 మంది జడ్జీల సస్పెన్షన్ ఎఫెక్ట్!... 200 మంది న్యాయమూర్తుల సామూహిక సెలవు!


హైకోర్టు విభజనలో జాప్యం, ఏపీ న్యాయమూర్తులకు ఆప్షన్లపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళనకు దిగిన తెలంగాణ న్యాయవాదుల నిరసనలు తెలుగు రాష్ట్రాల్లో పెను వివాదాన్నే రేపుతున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారంటూ ఇప్పటికే హైకోర్టు 11 మంది న్యాయమూర్తులపై సస్పెన్షన్ వేటు వేసింది. హైకోర్టు తీసుకున్న ఈ నిర్ణయంపై జడ్జీలంతా భగ్గుమన్నారు. సామూహిక సెలవులో వెళ్లేందుకు సిద్ధపడ్డారు. ఆందోళనలను మరింత ఉద్ధృతం చేసేందుకు సమాయత్తమయ్యారు. సామూహిక సెలవులో భాగంగా నేడు 200 మంది న్యాయమూర్తులు సామూహిక సెలవులో వెళ్లనున్నారు. సెలవు పెట్టి ఇంటిలో కూర్చునేందుకు బదులుగా వీరంతా తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ను ఆశ్రయించనున్నారు. ర్యాలీగా బయలుదేరి రాజ్ భవన్ చేరుకోనున్న జడ్జీలంతా హైకోర్టు తీరుపై గవర్నర్ కు ఫిర్యాదు చేయనున్నారు.

  • Loading...

More Telugu News