: చంద్రబాబు చైనా పర్యటన విజయవంతమైంది: సోమిరెడ్డి


పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని నెల్లూరు జిల్లా టీడీపీ ఆఫీస్‌ లో ఆ పార్టీ నేత కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి ఇఫ్తార్‌ విందు ఇచ్చారు. ఈ విందులో పాల్గొన్న సందర్భంగా ఎమ్మెల్సీలు సోమిరెడ్డి, బీద రవిచంద్ర మాట్లాడుతూ, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చైనా పర్యటన విజయవంతమైందని అన్నారు. సీఎం పర్యటన సందర్భంగా నెల్లూరులో 10,300 కోట్ల రూపాయల పెట్టుబడులతో ఎరువుల ఫ్యాక్టరీ ఏర్పాటు చేసేందుకు కంపెనీలు ముందుకొచ్చాయని సోమిరెడ్డి చెప్పారు. ఈ ఫ్యాక్టరీతో ఐదు వేల మంది నిరుద్యోగులకు ఉపాధి లభించనుందని ఆయన తెలిపారు. దీనితోపాటు దొనకొండలో 50వేల కోట్ల రూపాయల పెట్టుబడులతో పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు చైనా కంపెనీలు ముందుకు వచ్చాయని ఆయన అన్నారు.

  • Loading...

More Telugu News