: పరమశివుడికి జన్మనిచ్చానంటోన్న సోఫియా హయాత్!
అందాలభామ సోఫియా హయత్ గుర్తుంది కదా? బిగ్ బాస్ రియాలిటీ షోలో పాల్గొని క్రేజ్ పెంచుకున్న బాలీవుడ్ నటి, మోడల్ సోఫియా హయత్, టీమిండియా క్రికెటర్ రోహిత్ శర్మ డబుల్ సెంచరీకి గిఫ్టుగా నగ్న ఫోటో పంపిన సంగతి తెలిసిందే. రోహిత్ శర్మ వివాహం తరువాత ఉన్నట్టుండి నన్ (సన్యాసినిగా) మారిపోయానని ప్రకటించింది. ఈ విషయాన్ని మీడియా సమావేశం పెట్టి మరీ ప్రపంచానికి చాటింది. ఇకపై సన్యాసినిగా జీవిస్తానని, ఇకపై తనను అంతా 'గయా మదర్ సోఫియా'గా పిలవాలని సూచించింది. ఇదిలా ఉంచితే, తాజగా ఇప్పుడీమె కొత్త మాటలు చెబుతోంది. శివుడికి తానూ జన్మనిచ్చానని అంటోంది. నన్ అంటూ తెల్లని వస్త్రాలు ధరించి సందడి చేస్తున్న సోఫియా హయాత్, తాజాగా కైలాష్ యాత్రకు వెళ్లింది. ఈ సందర్భంగా ఎల్లోరా, ఔరంగాబాద్ లలో శివలింగంతో కలసి తీయించుకున్న ఫోటోలను ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. ఈ సమయంలో శివలింగం నుంచి ఓ భారీ అయస్కాంత శక్తి తనలో ప్రవేశించిందని, అప్పుడు కనీసం తలను కూడా పైకెత్తలేకపోయానని చెప్పింది. అయితే ఆ శక్తి ఏంటో అప్పుడు తనకు సరిగ్గా తెలియకపోయినా, ఇప్పుడిప్పుడే ఆ శక్తి ఏమిటో అర్థమవుతోందని చెప్పింది. పరమ శివుడికి తానూ జన్మనిచ్చానని చెప్పి అందరికీ షాకిచ్చింది.