: సెంటిమెంట్ రాజకీయాలు సరికాదు: టీఆర్ఎస్ నేతలపై డొక్కా మాణిక్యవరప్రసాద్


హైకోర్టు విభ‌జ‌న‌, న్యాయాధికారుల స‌స్పెన్ష‌న్‌పై టీఆర్ఎస్ నేత‌లు చంద్ర‌బాబు ప్ర‌భుత్వంపై చేస్తోన్న వ్యాఖ్య‌ల ప‌ట్ల మాజీ మంత్రి, టీడీపీ ఆంధ్ర‌ప్ర‌దేశ్ నేత డొక్కా మాణిక్యవ‌ర‌ప్ర‌సాద్ స్పందించారు. ఈరోజు గుంటూరులో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. హైకోర్టుపై కేంద్రం, సుప్రీంకోర్టు ఏ నిర్ణయం తీసుకున్నా త‌మ‌కు అభ్యంత‌రం లేద‌ని అన్నారు. టీఆర్ఎస్ నేత‌లు న్యాయ‌వ్య‌వ‌స్థ‌పై రాజ్యాంగ విరుద్ధంగా వ్యాఖ్య‌లు చేస్తున్నార‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు. సెంటిమెంట్‌తో రాజ‌కీయాలు చేయొద్ద‌ని సూచించారు. న్యాయాధికారుల నియామ‌కాల‌కు రాష్ట్ర ప్ర‌భుత్వంతో ఏం సంబంధం ఉంటుంద‌ని ఆయ‌న దుయ్య‌బ‌ట్టారు.

  • Loading...

More Telugu News