: చంద్రబాబును హిట్లర్, ముసోలినిలతో పోల్చిన ఉండవల్లి


కాపు రిజర్వేషన్ ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం విషయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హిట్లర్, ముసోలినిలా వ్యవహరించారని కాంగ్రెస్ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ వ్యాఖ్యానించారు. రాజమండ్రిలో ఆయన మాట్లాడుతూ, హిట్లర్, ముసోలినిల పరిపాలన కాలంలో ప్రజాఉద్యమాలను నిర్వీర్యం చేసి అణచి వేసేవారని అన్నారు. వారిలాగే చంద్రబాబు కూడా ముద్రగడను 13 రోజులు ఆసుపత్రిలో నిర్బంధించి, మానసికంగా బలహీనం చేయాలని చూశారని ఆరోపించారు. ఈ 13 రోజులు ఆయనకు టీవీ, పేపర్, ఫోన్ వంటి కనీస సౌకర్యాలు కూడా అందుబాటులో లేకుండా చేశారని ఆయన మండిపడ్డారు. ఆయన ఆసుపత్రిలో ఉన్నన్ని రోజులు రాజమహేంద్రవరాన్ని పాకిస్థాన్ బోర్డర్ లా మార్చేశారని ఆయన విమర్శించారు. చంద్రబాబు చేసిన ఈ పని వల్ల ముద్రగడకు మంచే జరిగిందని ఆయన అభిప్రాయపడ్డారు.

  • Loading...

More Telugu News