: రానున్న మూడు రోజుల వరకు తెలంగాణలో విస్తారంగా వర్షాలు.. పలు చోట్ల అతి భారీ వర్షాలు
తెలంగాణలోని పలు జిల్లాల్లో పడుతోన్న వర్షాలతో ఈరోజు పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. రానున్న మూడు రోజుల వరకు తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. పశ్చిమ బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోందని, దానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కూడా కొనసాగుతోందని పేర్కొన్నారు. పలు చోట్ల మెరుపులు, ఉరుములతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని, ప్రజలు అప్రమత్తంగా వుండాలని హెచ్చరించారు.