: ఇంజిన్‌లో స‌మ‌స్య‌.. డ్రైవర్‌ లేకుండా 15 కి.మీ. వెళ్లిన రైలు.. త‌ప్పిన పెనుప్ర‌మాదం


మహారాష్ట్రలోని రత్నగిరి స్టేషన్‌ సమీపంలో మడగావ్‌-నిజాముద్దిన్‌ రాజధాని ఎక్స్‌ప్రెస్ రైలు డ్రైవ‌ర్ లేకుండా 15 కిలోమీట‌ర్లు ప్ర‌యాణించింది. ఇంజిన్‌లో స‌మ‌స్య త‌లెత్త‌డంతో రత్నగిరి స్టేషన్‌ సమీపంలోని ఓ సొరంగ మార్గం వ‌ద్ద ట్రైన్‌ను నిలిపివేశారు. అయితే, ఇంజిన్‌లో స‌మ‌స్య‌ను స‌రిచేస్తుండ‌గానే ఒక్క‌సారిగా ఇంజిన్ దానిక‌దే స్టార్ట్ అయి ముందుకు క‌దిలింది. అలాగే 15 కిలోమీట‌ర్లు ప్ర‌యాణించింది. ట్రైన్ ప్ర‌యాణిస్తోన్న ఆ సమయంలో దాని డ్రైవర్‌ గార్డు క్యాబిన్‌లో ఉన్నాడు. ట్రైన్ డ్రైవ‌ర్ లేకుండా క‌ద‌ల‌డం ప‌ట్ల‌ సిబ్బంది స్పందించి రైలును ఆపేయ‌డంతో ప్ర‌యాణికులు ఊపిరిపీల్చుకున్నారు. స‌మ‌స్య త‌లెత్త‌డంతో టెక్నీషియ‌న్లు ఇంజిన్‌ వ్యాక్యూమ్‌ బ్రేక్‌ను తొలగించారని, రైలు ముందు భాగం వాలుగా ఉండ‌డంతో రైలు ఒక్క‌సారిగా క‌దిలింద‌ని సీనియర్‌ రైల్వే అధికారులు తెలిపారు. రైలుకి మ‌రో ఇంజిన్‌ను ఏర్పాటు చేసి మ‌ళ్లీ దాన్ని ద‌గ్గ‌ర‌లోని రైల్వేస్టేష‌నుకు త‌ర‌లించిన‌ట్లు అధికారులు వివ‌రించారు.

  • Loading...

More Telugu News