: ప్రొద్దుటూరులో దారుణం.. పాఠశాలలో బీరువా మీదపడి ఎల్‌కేజీ విద్యార్థిని మృతి
కడపజిల్లా ప్రొద్దుటూరులో దారుణ ఘటన చోటుచేసుకుంది. అక్కడి శ్రీవాణి పాఠశాలలో ఓ చిన్నారి మృతి చెందింది. పాఠశాలలోని బీరువా మీద పడడంతో భార్గవి అనే విద్యార్థిని అక్కడికక్కడే మృతి చెందింది. ప్రొద్దుటూరు మండలం లింగాపురంకు చెందిన ఈ చిన్నారి ఆ పాఠశాలలో ఎల్‌కేజీ చదువుతున్నట్టు పోలీసులు తెలిపారు. ఘటనపై పోలీసులు పూర్తి వివరాలను సేకరిస్తున్నట్లు సమాచారం. ఈ ఘటనలో పాఠశాల యాజమాన్యం నిర్లక్ష్యం ఉందా..? అనే అంశాన్ని ఆరా తీస్తున్నారు.