: ముద్రగడ ఇంటికి ఉండవల్లి అరుణ్ కుమార్
కాపు ఉద్యమ నేత, 13 రోజుల ఆమరణ నిరాహార దీక్ష చేసిన ముద్రగడ పద్మనాభంను కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ పరామర్శించారు. ఈ ఉదయం తూర్పు గోదావరి జిల్లా కిర్లంపూడిలోని ఆయన ఇంటికి వచ్చిన ఉండవల్లి, కాసేపు ఆయనతో ముచ్చటించారు. దాదాపు గంటకు పైగా సమావేశమైన ఉండవల్లి, ముద్రగడ, ఆయన భార్య, దీక్షలో కూర్చున్న కోడలు తదితరుల ఆరోగ్య పరిస్థితి గురించి వాకబు చేశారు. దీక్ష సందర్భంగా పోలీసుల వైఖరి గురించి ముద్రగడ ఆయనకు వివరించినట్టు తెలిసింది.