: హైకోర్టు విభజన అంశం తేల్చండి.. కేంద్రమంత్రి జితేంద్ర సింగ్‌తో తెలంగాణ ఎంపీల భేటీ
హైకోర్టు విభజన, తెలంగాణ న్యాయాధికారుల తొలగింపు అంశాన్ని కేంద్రం ముందు ఉంచుతామని టీఆర్ఎస్ ఎంపీ వినోద్ మీడియాతో చెప్పిన విషయం తెలిసిందే. ఇదే అంశంపై కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ తో టీఆర్ఎస్ ఎంపీలు ఢిల్లీలో ఈరోజు భేటీ అయ్యారు. హైకోర్టు విభజన క్రమంలో ఏర్పడుతోన్న అడ్డంకులు, జరుగుతోన్న ఆలస్యం అంశాలపై జితేంద్ర సింగ్ తో టీఆర్ఎస్ ఎంపీలు వినోద్, జితేందర్ రెడ్డి, విశ్వేశ్వర్ రెడ్డి చర్చిస్తున్నారు. తెలంగాణలో ఉద్రిక్తమవుతోన్న న్యాయవాదుల ఆందోళనను కేంద్రమంత్రి ముందుంచారు. తెలంగాణ న్యాయాధికారుల సస్పెన్షన్ అన్యాయమని జితేంద్ర సింగ్‌తో ఎంపీలు అన్నట్లు తెలుస్తోంది.