: తొలి క్యాబ్ డ్రైవర్ గా ఎందరికో స్ఫూర్తిగా నిలిచిన ఆమె... తన జీవితాన్ని బలవంతంగా ముగించింది!


భారతీ వీరత్... ఆంధ్రా ప్రాంతం నుంచి కర్ణాటకకు వలస వెళ్లిన యువతి. కుటుంబ జీవనాన్ని కొనసాగించేందుకు ప్రైవేట్ క్యాబ్ సేవల సంస్థ ఉబెర్ లో రెండేళ్ల క్రితం డ్రైవర్ గా చేరి, బెంగళూరులో తొలి మహిళా క్యాబ్ డ్రైవర్ గా చరిత్ర సృష్టించింది. భారతీ వీరత్ పై రాష్ట్రవ్యాప్తంగా, ఆపై నేషనల్ మీడియాలోనూ పత్రికలు ప్రత్యేక కథనాలు ప్రచురించాయి. ఇప్పుడా భారతి ఆత్మహత్య చేసుకుని తనువు చాలించింది. పోలీసులు వెల్లడించిన మరిన్ని వివరాల ప్రకారం, పదేళ్ల క్రితం కన్నడ ప్రాంతానికి వెళ్లిన ఆమె తొలుత టైలర్ గా, ఆపై ఓ స్వచ్ఛంద సంస్థ సహకారంతో డ్రైవింగ్ నేర్చుకుని క్యాబ్ డ్రైవర్ గా చేరింది. ఒంటరిగా ఉంటున్న ఆమె, గత కొంత కాలంగా, తిరిగి స్వగ్రామానికి వెళ్లిపోవాలని భావిస్తున్నట్టు ఇరుగు, పొరుగు వారికి చెప్పింది. రెండు రోజుల నుంచి ఆమె కనిపించకపోవడంతో, ఇంటి యజమాని ఆమె ఉంటున్న ఇంటి వద్దకు వెళ్లి కిటికీ లోంచి చూడగా, లోపల సీలింగ్ ఫ్యాన్ కు చీరతో ఉరేసుకున్న భారతి కనిపించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాఫ్తు ప్రారంభించారు.

  • Loading...

More Telugu News